హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లలను కలిసేందుకు అనుమతి లేదా?

VKB: బూరుగుపల్లి సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా విద్యార్థులకు రాఖీలు కట్టేందుకు వచ్చిన తల్లిదండ్రులను ఎండలో నిలబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఏడాదికి ఒకసారి వచ్చే రాఖీ పండుగ సందర్భంగా పిల్లలను కలిసేందుకు వచ్చిన తమను పాఠశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.