హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రీవెన్స్‌లో ప్రజల అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

KRNL: మాధవినగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని సూచించారు. గ్రీవెన్స్‌కు అన్ని శాఖల అధికారులు తప్పక హాజరై ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.