హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలి'

WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో శుక్రవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్‌‌ఛార్జ్ కట్ల రాజశేఖర్ మాదిగ జెండా ఆవిష్కరించారు. వికలాంగుల పెన్షన్‌ను రూ. 6 వేలకు తక్షణమే పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ మాదిగ, చాడ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.