NZB: మహిళా క్రికెటర్లలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో మహిళల క్రికెట్ ఎంపికలు నిర్వహించారు. నగరంలోని జీజీ కళాశాల క్రికెట్ సాధన మైదానంలో శుక్రవారం నిర్వహించిన ఎంపికలకు క్రీడాకారిణుల నుంచి మంచి స్పందన లభించింది. ఆటతీరును పరిశీలించిన అనంతరం 25 మంది మహిళా క్రికెటర్లను ఎంపిక చేశారు.
తెలంగాణ
'25 మంది క్రీడాకారిణులు ఎంపిక'


