హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉల్లి ధరల పెరుగుదలపై వైసీపీ విమర్శలు

KKD: నిత్యావసర ధరలు పెరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాకినాడకు చెందిన వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. ముఖ్యంగా ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పడుతోందన్నారు. ధరల నియంత్రణకు చర్యలు తీసుకుని, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.