హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా యాదాద్రి క్షేత్రంలో చండీ హోమం

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధిని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం చండీ హోమం ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలతో ముందుగా గణపతి ఆరాధన చేసి హోమ ద్రవ్యాలు, పూర్ణాహుతితో చండీ హవనం నిర్వహించారు. హోమంలో పాల్గొన్న వారికి అమ్మవారి ప్రసాదంగా అభిషేక లడ్డు, శేష వస్త్రం, కనుమలను అర్చకులు అందజేశారు.