హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే నాగరాజుకు రాఖీ కట్టిన చిన్నారులు, మహిళలు

హన్మకొండ నగరంలోని సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. మల్లికాంబ మనోవికాస కేంద్రం చిన్నారులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఎమ్మెల్యే చిన్నారులకు మిఠాయిలు పంచారు. నియోజకవర్గ మహిళలు కూడా ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.