SRD: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో రోహిణి తెలిపారు. అండర్-14, 17 విభాగాల్లో బాలురు, బాలికలకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు ఉంటాయన్నారు. విద్యార్థులను అధిక సంఖ్యలో భాగస్వాములను చేసి, పోటీలకు పక్కాగా సన్నద్ధం చేయాలని ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించారు.
తెలంగాణ
మండల స్థాయి క్రీడా పోటీలు: డీఈవో


