ADB: ఆదిలాబాద్ పట్టణంలోని టీబీ కేంద్రంలో శుక్రవారం రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా వైద్యులు వైద్యాధికారులకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావం, ఆత్మీయతను చాటే రాఖీ పండుగను వైద్యులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ అధికారి డా. సుమలత, లైజనింగ్ ఆఫీసర్ పవార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రాఖి వేడుకలు జరుపుకున్న వైద్యులు


