హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి 25 కుటుంబాలు చేరిక

NDL: డోన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 25 కుటుంబాల వారు చేరారు. ప్యాపిలి మండలం కలచట్ల గ్రామానికి చెందిన ఎంపిటిసి పార్వతమ్మ తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే సమక్షంలో చేరడంతో గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.