హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కుక్కకాటు బాధితులకు టీకాలు అందించాలి'

NZB: వేల్పూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ వెంకటేష్ ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్‌సీలో నమోదవుతున్న కుక్కకాటు కేసుల వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించి, కుక్కకాటు నివారణ సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. కుక్కకాటుకు గురైన బాధితులకు సకాలంలో టీకాలు అందించాలన్నారు.