హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా సంతోషిమాత జయంతి ఉత్సవాలు

MDK: తూప్రాన్ శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో కొలువైన శ్రీ సంతోషిమాత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు సోమయాజుల రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, చతుష్షష్టి ఉపచార పూజ, రక్షాబంధన కార్యక్రమాలు చేపట్టారు. కౌన్సిలర్ కొడిప్యాక అన్నపూర్ణ నారాయణగుప్తా దంపతులతో పాటు పలువురు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.