హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెంజర్లలో ట్రాక్టర్‌పై మగ్గం నేత

KNR: రాఖీ పౌర్ణమి సందర్భంగా చెంజర్లలో పద్మశాలీలు సంప్రదాయ మగ్గం నేత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రాక్టర్‌పై మగ్గాన్ని ఏర్పాటు చేసి నేత నేశారు. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా గుట్టపై శివాలయం వరకు కార్యక్రమం సాగింది. నేసిన వస్త్రాలను హనుమాన్ గుడి, శివాలయం, గుట్ట శివాలయంలో దేవతామూర్తులకు సమర్పించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.