హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆడబిడ్డకు అండగా నిలిచిన కలెక్టర్

JN: దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామానికి చెందిన మహమ్మద్ సుల్తానా బేగంకు జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్ అందించారు. భర్త కుటుంబ బాధ్యతలను వదిలి వెళ్లడంతో నాలుగేళ్ల చిన్నారితో ఒంటరిగా జీవిస్తున్న ఆమె ఉపాధి కల్పించాలని కలెక్టర్‌ను కోరగా, స్పందించిన ఆయన వెంటనే కుట్టు మిషన్ అందజేశారు.