SKLM: ఆముదాలవలస మండలం జొన్నలవలస గ్రామం వద్ద శుక్రవారం శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌సీ లక్ష్మణరావు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే 112కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అత్యవసర సమయంలో ఫోన్ చేయాలి'


