హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేను కలిసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు

ఆసిఫాబాద్ జిల్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల JAC నాయకులు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబుని శుక్రవారం కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావాలని ఎమ్మెల్యేను కోరారు. వర్షా కాలం అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి చర్చకు పట్టు పడతామని అన్నారు.