హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి రాఖీ కట్టిన ఎంపీ

WGL: రాఖీ పౌర్ణమి సందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంపీ కడియం కావ్య శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ కావ్య ఆయనకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.