HYD: గాంధీ ఆస్పత్రి ఆవరణలో నిస్సహాయ స్థితిలో ఉన్న యాదాద్రి జిల్లాకు చెందిన రాజు (60)కు చిలకలగూడ పోలీసులు అండగా నిలిచారు. ఇన్‌స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ ఆదేశాలతో ఎస్‌ఐ శివ, హెడ్ కానిస్టేబుల్ పూస శ్రీనివాస్ వృద్ధుడికి భోజనం అందించి, సికింద్రాబాద్‌లోని డ్రీమ్ ఇండియా వృద్ధాశ్రమంలో చేర్పించారు. పోలీసుల మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు.
తెలంగాణ
వృద్ధుడికి భోజనం.. ఆశ్రమంలో చేరిక


