హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్రగాయాలు..

KMM: కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతుల్లో భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.