హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్ భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలి'

NRML: పెండింగ్‌లో ఉన్న భూసమస్యల దరఖాస్తులను ప్రాధాన్యతతో త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తులను సమీక్షించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని సూచించారు.