హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి'

MBNR: వీహెచ్‌పీఎస్ 19వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జైపాల్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. వికలాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాలని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ప్రత్యేక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.