SKLM: పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో ధర్మ హుండీల లెక్కింపును శనివారం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ టి. వాసుదేవరావు తెలిపారు. దేవాదాయశాఖ అధికారులు, ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, అర్చకులు, భక్తుల సమక్షంలో లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల భక్తులు నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ లెక్కింపులో పాల్గొనవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు అమ్మవారి ధర్మ హుండీల లెక్కింపు


