VSP: పరవాడ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ మురళీకృష్ణ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దేశపాత్రునిపాలెం, జాజులవానిపాలెం, గొర్లెవానిపాలెం తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


