హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి ఇస్కాన్‌లో కృష్ణాష్టమి వేడుకలు

E.G: రాజమహేంద్రవరం గౌతమఘాట్‌లోని ఇస్కాన్ మందిరంలో ఈనెల 28 నుంచి సెప్టెంబరు 5 వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో భాగంగా ప్రతి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు మంగళ హారతి, ఉదయం 7.30గంటల దర్శన హారతి, 8గంటలకు గురు పూజ, భాగవత ప్రవచనం ఉంటాయి. సాయంత్రం 4గంటలకు యజ్ఞసేవ, శ్రీకృష్ణ లీలలపై ప్రవచనం, స్వామివారి వాహన సేవ, ఊంజల సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.