హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి బోయకొండ గంగమ్మ తిరుణాల

CTR: సోమల మండలంలోని చిన్న సోమలలో శనివారం నుంచి బోయకొండ గంగమ్మ తిరుణాల నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 29న అమ్మవారి ఊరేగింపు, 30న సోమలలో ఊరేగింపు అనంతరం అమ్మవారిని ఆలయానికి తీసుకువస్తామని వెల్లడించారు. రాత్రి వీధి నాటకం, 31న ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.