GNTR: సీబీన్ వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్‌లో లీకేజీ కారణంగా 28వ తేదీన 21, 22, 23, 24వ వార్డుల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనున్నట్లు తెనాలి పురపాలక సంఘం అధికారులు తెలిపారు. ఉదయం వేళ నిలిచిపోయే నీటి సరఫరాను, మరమ్మతు పనులు పూర్తి చేసి సాయంత్రానికి పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో నేడు మంచినీటి సరఫరా బంద్!


