HYD: ఈనెల 30న NMDC మారథాన్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 4 గంటల నుంచి ప్రధాన మార్గాల్లో మళ్లింపులు ఉంటాయి. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, కొల్లూరు పరిధిలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.


