హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువుకు నీటిని విడుదల చేయాలి: ఎమ్మెల్యే

BDK: జూలూరుపాడు మండలం వినోభానగర్‌ వద్ద సీతారామ ప్రాజెక్టు రెగ్యులేటర్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇరిగేషన్‌, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ ద్వారా తక్షణమే సింగభూపాలెం చెరువుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సీతారామ ప్రాజెక్టు నీటిని అందించాలని ఆయన అన్నారు.