WGL: వర్ధన్నపేట పట్టణంకు చెందిన వడ్లకొండ సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన జ్ఞాపకార్థం తల్లిదండ్రులు వ్యవసాయ క్షేత్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సోదరి శ్రీకృతి అన్న విగ్రహానికి రాఖీ కట్టి నివాళులర్పించారు. ఈ ఘటన అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచింది.
తెలంగాణ
VIDEO: అన్న జ్ఞాపకార్థం విగ్రహానికి చెల్లెలి రాఖీ


