హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేములవాడలో ఘనంగా యజుర్వేద ఉపాకర్మ

SRCL: వేములవాడ రాజన్న క్షేత్రంలోని భీమేశ్వరాలయ గాయత్రీ మండపంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా యజుర్వేద ఉపాకర్మను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనువంశిక అర్చకులు సామూహికంగా ప్రాయశ్చిత్త పూజలు చేసి నూతన యజ్ఞోపవీత ధారణ చేశారు. ఆలయం ఆవిర్భవించిన నాటి నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు అర్చకుడు నమిలకొండ రాజేశ్వర శర్మ తెలిపారు.