GDWL: అలంపూర్ పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి రైతు సంఘం వరకు ఏర్పాటు చేసిన డివైడర్‌లో పట్టణ సుందరీకరణలో భాగంగా మొక్కలు నాటారు. వాటిని మేకలు మేస్తుండటంతో మొక్కలు ధ్వంసమవుతున్నాయి. దీంతో పట్టణ సుందరీకరణ లక్ష్యం నీరుగారుతోంది. మేకల యజమానులకు అవగాహన కల్పించడంతో పాటు, అధికారులు పర్యవేక్షణ చేపట్టి మొక్కలను రక్షించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
హరితహారం.. మేకలకు ఆహారం


