హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

SRPT: నడిగూడెం మండలం సిరిపురంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్కా చెల్లెళ్లు వారి సోదరులకు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి, అనురాగాన్ని చాటగా సోదరులు వారికి కానుకలు ఇచ్చారు. చిన్నారులు చిట్టి చేతులకు రాఖీలు కట్టుకొని మురిసిపోయారు. ఈ సందర్భంగా మెట్టింటికి రాఖీలు కట్టేందుకు మహిళలు తరలిరావడంతో ప్రతి ఇంటా సంతోషకరమైన పండుగ వాతావరణం నెలకొంది.