BHPL: వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి ఆలయం శ్రావణ నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. అర్చకులు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి విశేష పూర్ణాభిషేకం నిర్వహించి, నూతన వస్త్రాలతో వైభవంగా అలంకరించారు. సెలవు రోజు కావడంతో నగరంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తెలంగాణ
భక్తులతో కిక్కిరిసిన భద్రకాళి ఆలయం


