హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వానంగా బీటీ రోడ్డు.. అవస్థలు

NGKL: తాడూరు మండల కేంద్రం నుంచి యాదిరెడ్డిపల్లి వరకు ఉన్న బీటీ రోడ్డు గత కొంతకాలంగా అధ్వానంగా మారింది. రహదారిపై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.