హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

NGKL: రాఖీ పౌర్ణమి సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ తన అక్కాచెల్లెళ్లు, సోదరీమణులతో కలిసి రాఖీ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. సోదరీమణుల నుంచి ఆప్యాయంగా రాఖీలు కట్టించుకుని ఆశీస్సులు పొందారు. అక్కాచెల్లెళ్ల అనుబంధం కలకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.