MDK: తూప్రాన్ మండలం యావాపూర్ వద్ద ఈ నెల 20న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కట్టే వెంకటేష్ (56) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. నాచారం స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన వెంకటేష్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి


