HNK: హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా నేరెళ్ల వెంకట హైమ పూజిత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన ఆమె పదోన్నతిపై బదిలీ అయ్యారు. అర్హులకు ఉచిత న్యాయ సహాయం, ప్రజల్లో న్యాయ సేవలపై అవగాహన కల్పించడం, లోక్ అదాలత్‌ల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తానని ఆమె తెలిపారు.
తెలంగాణ
న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా హైమ పూజిత బాధ్యతలు


