హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క

MLG: మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. 'రాఖీ పౌర్ణమి' పండుగను పురస్కరించుకుని రేవంత్ రెడ్డికి సీతక్క రాఖీ కట్టి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని మంత్రి తెలిపారు.