NRML: నిర్మల్ వృక్షాల పరిరక్షణకు నిర్మల్ అర్బన్ కేజీబీవీ విద్యార్థులు ముందుకొచ్చారు. రాఖీ పండుగ సందర్భంగా విద్యార్థినులు చెట్లకు రాఖీలు కట్టి 'వృక్ష బంధన్' కార్యక్రమం నిర్వహించారు. చెట్లను సోదరులుగా భావించి వాటిని కాపాడుకోవాలనే సందేశాన్ని ఇచ్చారు. వృక్షాలు ఆక్సిజన్, నీడ, ఆహారం అందిస్తాయని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
తెలంగాణ
చెట్లకు రాఖీలు కట్టిన విద్యార్థినులు..!


