హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్‌కు రాఖీ కట్టిన రిమ్స్ నర్సింగ్ సిబ్బంది

ADB: రక్షాబంధన్ పండుగ మహిళలకు రక్షణ, గౌరవం కల్పించాల్సిన బాధ్యతను గుర్తుచేస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం రిమ్స్ నర్సింగ్ సుపరింటెండెంట్, హెడ్ నర్సు కలెక్టర్‌తో పాటు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌కు రాఖీలు కట్టారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు నర్సింగ్ సిబ్బంది అందిస్తున్న సేవలను కలెక్టర్ అభినందించారు.