హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చక్రాల ప్రయాణంలో... క్షణం ఆగిన రక్షాబంధనం!

KNR: జిల్లాలోని తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద రాజీవ్ రహదారిపై ఒక అపురూప దృశ్యం చోటుచేసుకుంది. గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపించి, డ్రైవర్‌గా విధుల్లో ఉన్న తన తమ్ముడు రాజుకు అక్క స్వప్న రాఖీ కట్టింది. పండుగ రోజున కూడా విధులకు హాజరైన తమ్ముడిపై ఆమె చూపిన ప్రేమాభిమానాలు ప్రయాణికులను ఆకట్టుకున్నాయి.