హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేణుక ఎల్లమ్మ ఆలయంలో భక్తుల సందడి

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవస్థానానికి రాఖీ పౌర్ణమి, శుక్రవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో సందడి నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు నాగుల ప్రతిమల వద్ద అభిషేకాలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.