RR: నగర శివారు పెద్దఅంబర్‌పేట్ అంగన్వాడీ సెంటర్‌లో ఆగస్టు 2వ విడతలో ఇచ్చిన 8గుడ్లు కుళ్లినవి వచ్చాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తీసుకున్న గుడ్లలో రెండింటిని శుక్రవారం ఉడకబెట్టి, పొట్టు తీస్తుండగా కుళ్లిన వాసనతోపాటు డార్క్ కలర్‌లో కనిపించాయని ఓ మహిళ మండిపడ్డారు. పసిపిల్లల ఆరోగ్యంతో చెలగాటమా, దీనిపై అధికారులు స్పందించాలని కోరారు.
తెలంగాణ
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు


