హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోరిటలో పాత మొబైళ్ల కొనుగోలుపై విచారణ

NGKL: తిమ్మాజీపేట మండలం గోరిటలో పాత మొబైల్స్ కొనుగోలు చేసేందుకు వచ్చిన కొందరిని యువత గుర్తించి పోలీసులకు అప్పగించారు. వారి వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. తెలియని వ్యక్తులకు ఫోన్లు విక్రయించవద్దని మిద్దె రవి సూచించారు. అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవాలని కోరారు.