హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తునూరులో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

KMR: సదాశివనగర్‌ మండలం ఉత్తునూరు గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్‌ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలను పొందేందుకు స్మార్ట్‌ రేషన్‌ కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాహుల్, ఉపసర్పంచ్‌ రాజయ్య, లబ్ధిదారులు పాల్గొన్నారు.