హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సులు'

WNP: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం వనపర్తి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. పండుగ రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రద్దీ సమయంలో ముందస్తుగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని కోరారు.