హైదరాబాద్: 28°C
క్రైమ్

లారీని ఢీకొట్టిన బస్సు.. 16 మంది గాయాలు

AP: తిరుపతి జిల్లా పెళ్లకూరు మం. చెంబడిపాళెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టెల లోడుతో ఆగి ఉన్న లారీని కర్ణాటక RTC బస్సు ఢీకొట్టింది. బస్సు బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా 16 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.