వజ్రాసనం వేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. భోజనం చేసిన తర్వాత ఈ ఆసనం వేయడం వల్ల కడుపు ప్రాంతానికి రక్తప్రసరణ పెరిగి, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ ఆసనంలో నిటారుగా కూర్చోవడం వల్ల వెన్నుపూస సరిగ్గా అమరి, భంగిమ మెరుగుపడుతుంది. నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యం
వజ్రాసనం వల్ల కలిగే ఉపయోగాలు


