రాఖీ పండగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న అక్కాచెల్లెళ్లు పుట్టింటి బాట పట్టారు. అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. చాలా కాలం తర్వాత పుట్టింటికి వచ్చిన అక్కాచెల్లెళ్లతో ఇళ్లలో పండగ వాతావరణం కనిపిస్తోంది. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ పలకరింపులు, కుటుంబ సభ్యుల కలయికతో గ్రామాల్లో రాఖీ వేడుకల సందడి ముందుగానే మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
పుట్టింటికీ అక్కాచెల్లెళ్లు.. గ్రామాల్లో రాఖీ సందడి


