SKLM: రాఖీ పౌర్ణమి, శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆమదాలవలసలోని మార్కెట్ గురువారం సాయంత్రం వినియోగదారులతో కిటకిటలాడింది. పండుగను పురస్కరించుకుని రాఖీలు, స్వీట్లు, పూలు, పండ్లు తదితర వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు మార్కెట్‌కు తరలివచ్చారు. దీంతో మార్కెట్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. వినియోగదారుల రాకతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొనుగోళ్లతో కిటకిటలాడిన మార్కెట్


